News February 17, 2025
కొమరవెల్లి మల్లన్నకు 14 కిలోల వెండి తొడుగు ఆభరణాలు అందజేత

కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా Epitome Projects కంపెనీ అధినేత కంత జైపాల్ భార్య శ్రీవిద్య దంపతులు కలిసి స్వామివారికి 14 కిలోల వెండి తొడుగు ఆభరణాలను ఆదివారం అందజేశారు. ఈ ఆభరణాలను వారి తల్లిదండ్రులైన కంత స్వర్ణలత భర్త అశోక్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ఈఓకు అందించారు. వీటిల్లో విఘ్నేశ్వర స్వామి, మునీశ్వర స్వామి, సంగమేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి.
Similar News
News April 17, 2026
ముర్రా జాతి గేదెలతో ఎందుకు మేలంటే?

ముర్రా జాతి పశువు జీవితకాలం 20 ఏళ్లుగా ఉంటుంది. 10 ఈతలు ఈనడానికి అవకాశం ఉంటుంది. రెండున్నరేళ్ల నుంచి మూడేళ్ల వయసు మధ్యలో ముర్రా గేదెలు ఎదకు వస్తాయి. ఏటా ఈ గేదెలకు దూడ పుట్టడం పాడి రైతుకు లాభదాయకం. ముర్రా గేదెలు ఈనిన తర్వాత 3 నెలలకే మళ్లీ ఎదకు రావడం వాటిలో గొప్ప లక్షణం. తర్వాత పది నెలలకు ఈనుతుంది. ఇలా ప్రతి ఏడాదీ దూడ పుట్టడానికి, పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.
News April 17, 2026
హుండీలో వేసిన నాగ పడగలను ఏమి చేస్తారంటే..!

రాహుకేతు పూజల అనంతరం వెండి నాగ పడగలను భక్తుల చేతులతోనే హుండీలో సమర్పిస్తారు. అనంతరం హుండీలో నుంచి సేకరించిన నాగ పండుగలను చెన్నైకు తరలిస్తారు. అక్కడ ఈ వెండి నాగ పడగలను కరిగించి, తిరిగి నూతన నాగ పడగలు తయారు చేసి శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి తరలిస్తారు. మేకింగ్ ఛార్జెస్, ట్రాన్స్‌పోర్ట్ మినహా… ఆలయ దేవస్థానం వద్ద ఉన్న వెండితోనే రొటేషన్ అవుతూ వస్తుంది.
News April 17, 2026
NTR: నెలకో అధికారి బదిలీ.. ఆ శాఖకు ఏమైంది?

NTR జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖలో అధికారుల వరుస బదిలీలు అభివృద్ధికి శాపంగా మారాయి. గడిచిన 6 నెలల్లో నలుగురు SEలు మారడం గమనార్హం. అధికారులు ఇక్కడి పరిస్థితులు అవగాహన చేసుకునేలోపే బదిలీ అవుతుండటంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ నత్తనడకన సాగుతోంది. తిరువూరు కిడ్నీ బాధితులకు కృష్ణా జలాల సరఫరా హామీ ప్రకటనలకే పరిమితమైంది. పాలనాపరమైన అస్థిరతతో తాగునీటి ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా మారాయి.


