News February 17, 2025

బాలికతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరిపై కేసు: ఎస్‌ఐ

image

నూజివీడులో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై వరసకు అన్నదమ్ములు అయ్యే ఇద్దరు మైనర్లు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జ్యోతిబాసు తెలిపారు. గత రాత్రి ట్యూషన్‌కు వెళ్తున్న బాలికపై ఇద్దరు మైనర్లు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారన్నారు. బాలిక వారి నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

Similar News

News November 5, 2025

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అస్వస్థత

image

అమలాపురం: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైసీపీ అమలాపురం ఇన్‌ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఆసుపత్రికి వచ్చారు. పలువురు వైసీపీ శ్రేణులు ఆసుపత్రి చేరుకుంటున్నాయి.

News November 5, 2025

సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు: రాజ్‌నాథ్ సింగ్

image

ఇండియన్ ఆర్మీని 10% అగ్రవర్ణాలు కంట్రోల్ చేస్తున్నారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘సైన్యానిది ఒక్కటే మతం. అదే “సైన్యధర్మం”. దానికి ఇంకో మతం లేదు’ అని అన్నారు. ఆర్మీని రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో సైన్యం ధైర్యసాహసాలతో దేశం తలెత్తుకొనేలా చేస్తోందన్నారు. కులమత రాజకీయాలు దేశానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు.

News November 5, 2025

HYD: T-Hub దశాబ్దపు విజయం: KTR

image

5 NOV 2015న T-Hub ఆవిర్భావంతో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ భారతదేశపు స్టార్టప్ రాజధానిగా నిలిచిందని KTR ‘X’ లో పోస్ట్ చేశారు. T-Hubతో మొదలై We-Hub, T-Works వంటి సంస్థలతో కూడిన ఈ అద్భుతమైన ఎకోసిస్టమ్‌ను ‘ఆధునిక భారతదేశానికి ముఖచిత్రం’ అన్న రతన్ టాటా వ్యాఖ్యలను గుర్తుచేశారు. గత దశాబ్దంలో T-Hub సాధించిన ఈ ఘనత తనకు గర్వకారణమని రాసుకొచ్చారు.