News February 17, 2025

సంగారెడ్డి: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో..!

image

MDK-KNR-NZB-ADB టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Similar News

News November 10, 2025

పటాన్‌చెరు: సీఐటీయూ జిల్లా కోశాధికారిగా రాజయ్య

image

సీఐటీయూ జిల్లా కోశాధికారిగా రాజయ్యను నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మల్లేశం తెలిపారు. రాజయ్య మాట్లాడుతూ.. తనను జిల్లా కోశాధికారిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని పేర్కొన్నారు.

News November 10, 2025

మెగాస్టార్ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్!

image

స్వింగ్ జరా, కావాలయ్యా వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు టాక్. ప్రత్యేక సెట్‌లో సాంగ్‌ షూట్ చేయడానికి అనిల్ రెడీ అవుతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News November 10, 2025

అందెశ్రీ అస్తమయం.. ఇందూరుతో ప్రత్యేక అనుబంధం

image

జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన ప్రముఖ కవి ‘అందెశ్రీ’కి నిజామాబాద్ జిల్లాతో అనుబంధం ఉంది. అందె ఎల్లయ్య (అందెశ్రీ) కొన్ని సంవత్సరాల క్రితం జిల్లాలోని మాక్లూర్ మండలంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. ఆ సమయంలో అమ్రాద్‌లో శంకర్ మహరాజ్ వద్ద శిష్యరికం చేశారు. ఆ సమయంలోనే సమాజాన్ని అర్థం చేసుకునే తత్వం అలవాటైందని, కవిత్వం సైతం ఇందూరులోనే నేర్చుకున్నానని ఆయన తరచూ చెప్పేవారు.