News February 17, 2025

కేయుూ: 21 నుంచి LLB మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

image

కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు(రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసిమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.

Similar News

News February 27, 2026

పాలమూరు: హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

image

TGSC స్టడీ సర్కిల్‌లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్ నగర్‌లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి1న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

News February 27, 2026

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 27)

image

1931: స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ మరణం(ఫొటోలో)
1932: ఆంగ్లో-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ జననం
1932: కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణుడు వేగె నాగేశ్వరరావు జననం
1956: లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మావలంకర్ మరణం
1972: సినీ నటుడు శివాజీ రాజా పుట్టినరోజు
2002: సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనం, 59 మంది VHP కరసేవకులు మృతి

News February 27, 2026

108 రన్స్ తేడాతో గెలిస్తే సీన్ వేరేలా ఉండేది

image

T20 WC: భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసినా వెస్టిండీస్ నెట్ రన్ రేట్‌ను మాత్రం దాటలేకపోయింది. ఇండియా 256 రన్స్ చేసినప్పటికీ విండీస్‌ను దాటాలంటే జింబాబ్వేను 148 లోపే కట్టడి చేయాల్సింది. అంటే కనీసం 108 పరుగుల తేడాతో గెలవాల్సింది. దీంతో మార్చి 1న విండీస్‌తో జరిగే మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే రన్ రేట్ తక్కువగా ఉన్న టీమ్‌ఇండియా ఇంటికి వచ్చేస్తుంది.