News February 17, 2025

HYDలో నేడు డ్రింకింగ్ వాటర్ బంద్

image

గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లో డయా వాల్వులు అమర్చుతున్నారు. ఈ కారణంగా SRనగర్‌, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, మూసాపేట, చింతల్, సుచిత్ర, అల్వాల్‌, చరపల్లి, మాదాపూర్, కొండాపూర్‌, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, నాగారం, నిజాంపేట, బాచుపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. రేపు ఉదయం వరకు సరఫరా ఉండదు.
SHARE IT

Similar News

News January 16, 2026

హైదరాబాద్‌లో ఆదివారం రెడీనా?

image

ఆదివారం పొద్దున్నే నిద్రలేచి, సైకిల్ ఎక్కి గాలిలో దూసుకెళ్లడానికి మీరు సిద్ధమా?. JAN 18న ఉదయం 7 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో 57వ ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ రచ్చ జరగబోతోంది. “ఫిట్‌నెస్ కా డోస్.. ఆధా ఘంటా రోజ్” అంటూ పుల్లెల గోపీచంద్, దీప్తి జీవంజి వంటి దిగ్గజాలతో కలిసి 6 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగుతుంది.

News January 16, 2026

ఇది HYD మెట్రో ప్రయాణికుల కోసం!

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు విజ్ఞప్తి. L&T మెట్రో రైల్ కొత్తగా సర్వే చేస్తోంది. పై ఫొటోలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని పిలుపునిచ్చింది. దీని వలన ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా చేయడానికి సాయం చేస్తుందని పేర్కొంది. నిత్యం మెట్రోలో ప్రయాణించేవారికి ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.

News January 16, 2026

హైదరాబాద్ TIMS.. హెల్త్ హబ్‌ కోసమే! (1)

image

హైదరాబాద్ నగరాన్ని హెల్త్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఏప్రిల్ 2022లో ఈ మెగా ప్రాజెక్టుకు పునాది పడింది. నగరం నలువైపులా (సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీనగర్, గచ్చిబౌలి) సుమారు రూ.4,400 కోట్లతో నిర్మిస్తున్న 4 అత్యాధునిక ఆసుపత్రుల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, అధికారం మారడం, నిధుల విడుదల, పరికరాల సేకరణలో జాప్యం వల్ల ఈ ప్రాజెక్టు గడువులు నిరంతరం మారుతూ వస్తున్నాయి.