News February 17, 2025
ఐ.పోలవరం: బ్రిడ్జిపై నుంచి దూకి వృద్ధుడి ఆత్మహత్య

ఐ.పోలవరం మండలం మురమళ్ల బ్రిడ్జిపై నుంచి దూకి పశువుల్లంకకు చెందిన చింతలపూడి శ్రీనివాసరావు (66) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. అతని మృతదేహం ఆదివారం లభ్యమయింది. అల్లుడు రవికుమార్ వేధింపులు భరించలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య అమ్మాజీ ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెకు విడాకులు ఇవ్వకుండా కొంతకాలం నుంచి అల్లుడు ఇబ్బంది పెడుతున్నాడన్నారు. దీనిపై ఎస్సై మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేశారు.
Similar News
News January 15, 2026
పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.
News January 15, 2026
ఏటూరునాగారం: ఇద్దరు మావోయిస్టు సభ్యులు లొంగుబాటు

ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఎదుట ఇద్దరు మావోయిస్టు లొంగిపోయారు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు. మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధి బందిపార గ్రామానికి చెందిన కుడియం పాండు, టెర్రం పోలీస్ స్టేషన్ పరిధి పెద్దిబట్టిగూడెంకు చెందిన ముచ్చక్కి మంగల్ మద్దెడు ఏరియా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సరెండర్ పాలసీలో భాగంగా వారికి రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
News January 15, 2026
NTR: 24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్..!

గాయత్రి నగర్‌లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 13న ఓ మహిళ మెడలో నుంచి రూ. 9 లక్షల విలువైన బంగారు గొలుసును తెంచుకుపోయిన పటమటకు చెందిన మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని, దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ ఏసీపీ దామోదర్ వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.


