News February 17, 2025

APPLY NOW: భారీ జీతంతో 1,000 ఉద్యోగాలు

image

ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 60% మార్కులతో డిగ్రీ పాసై, 20-30 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ నెలకు రూ.48,480-రూ.85,920 ఉంటుంది. వెబ్‌సైట్: <>https://www.centralbankofindia.co.in/<<>>

Similar News

News December 31, 2025

8th Pay Commission: జీతం పెంపు ఎంత ఉండొచ్చంటే..?

image

8వ వేతన సంఘం <<18638670>>రేపటి<<>> నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 1.8-2.86 మధ్య ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 7వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ప్రకటించగా.. కనీస మూల వేతనం ₹7,440 నుంచి ₹18 వేలకు పెరిగింది. ఇప్పుడు ఒకవేళ ఫిట్‌మెంట్ 2.15గా ప్రకటిస్తే ₹18 వేల బేసిక్ శాలరీ ఉన్న వారికి ₹38,700కు పెరగవచ్చు.

News December 31, 2025

ఈ కోళ్ల మాంసం KG రూ.2 లక్షల పైనే..

image

సాధారణంగా కేజీ చికెన్ ధర కోడిని బట్టి రూ.1000లోపే ఉంటుంది. ఇంకా అరుదైనది అయితే రూ.2వేలు లోపే. అయామ్ సెమనీ, ఒనగడోరి జాతులకు చెందిన కోడి మాంసం మాత్రం కేజీ ధర అక్షరాల రూ.2 లక్షల పైమాటే. డాంగ్ టావో జాతి కోడి మాంసం కిలో రూ.లక్షన్నర పైనే. కొన్ని ప్రత్యేక లక్షణాలే దీనికి కారణం. అసలు ఈ కోళ్లకు ఎందుకు అంత ధర? కిలో రూ.లక్షలు పలికే ఈ కోళ్ల జాతులు ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 31, 2025

టోల్ మినహాయించాలని లేఖ.. BRS విమర్శలు

image

TG: సంక్రాంతికి HYD-విజయవాడ మార్గంలో <<18708714>>టోల్<<>> మినహాయించాలని కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడంపై BRS శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘తెలంగాణ ప్రజలపై ఇదే దయ ఎందుకు చూపరు. HYDలో ఉన్న తెలంగాణ బిడ్డలు వరంగల్, కరీంనగర్, ADB, మహబూబ్ నగర్, నల్గొండ వైపులకు వెళ్లేందుకు రూ.వందల టోల్ ఫీజులు కడుతున్నారుగా. దసరా, బతుకమ్మకూ ఇదే మినహాయింపు ఇవ్వండి మరి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నాయి.