News February 17, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అధికం

ఉమ్మడి KNR, MDK, ADB, NZB జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌లోనే దాదాపు 45 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరూ KNR కేంద్రంగానే ప్రచారంపై దృష్టి పెడుతున్నారు. అన్ని పార్టీల అధినేతలు KNR కేంద్రంగానే తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దాదాపు 3 లక్షల 50వేల పైచిలుకు ఓట్లలో సగం ఉమ్మడి KNR జిల్లాలోనే ఉన్నాయి.
Similar News
News November 15, 2025
లక్నోకు అర్జున్, షమీ.. DCకి నితీశ్ రాణా

ఐపీఎల్ రిటెన్షన్ గడువు నేటితో ముగుస్తుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ట్రేడ్ చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ నుంచి సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ లక్నోకు వెళ్లారు. సన్‌రైజర్స్ బౌలర్ షమీ కూడా LSG జట్టులో చేరారు. అటు రాజస్థాన్ రాయల్స్‌ను వీడిన నితీశ్ రాణా ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరారు. KKR ప్లేయర్ మయాంక్ మార్కండేను ముంబై ట్రేడ్ చేసుకుంది.
News November 15, 2025
వంజంగి మంచు కొండలో పర్యాటకుల సందడి

వంజంగి మంచు కొండ శనివారం పర్యాటకులతో రద్దీగా మారింది. తెల్లవారుజామున కురిసిన మంచు కొండపై ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పగా, పరిసరాలు స్వర్గధామంలో మెరిసిపోయాయి. మంచుతో కప్పుకున్న కొండలు, మేఘాల దుప్పటి మధ్య కనిపించిన పర్వత సౌందర్యాన్ని సెల్ఫోన్లు, కెమెరాల్లో బంధిస్తూ పర్యాటకులు మురిపెంగా గడిపారు. కుటుంబాలు, యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.
News November 15, 2025
CII సమ్మిట్.. శ్రీసిటీలో మరో 5 ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన

CII సమ్మిట్‌లో మరో 5 ప్రాజెక్ట్‌లను CM చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుపతి (D) శ్రీసిటీలో ఈ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నట్లు CM చెప్పారు. పార్క్‌లో ఇప్పటికే 240 యూనిట్లు ఉండగా.. వెర్మీరియన్ ఇండియా రెహబ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్మ్వెస్ట్ మిరాయ్‌టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, థింక్ గ్యాస్, ఆన్‌లోడ్‌గేర్స్ ఎక్స్‌పోర్ట్స్, యూకేబీ ఎలక్ట్రానిక్స్ ఈ లిస్ట్‌లో చేరనున్నాయి.


