News March 20, 2024

KTDM:పోలీసుల ఎదుట శబరి ఏరియా మావోయిస్టు లొంగుబాటు

image

తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు చర్ల మండలం ఎర్రంపాడుకి చెందిన మడివి బుద్ర బుధవారం జిల్లా పోలీసులు, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారులు సమక్షంలో లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం తరఫున ఇతనిపై రూ. 4లక్షల రివార్డు ఉందని, మావోయిస్ట్ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక లొంగిపోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈసమావేశంలో సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 5, 2026

ఖమ్మంలో ఈ నెల 10 నుంచి టీసీసీ పరీక్షలు

image

ఖమ్మం జిల్లాలో ఈ నెల 10 నుంచి 13 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (TCC) పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్య జైని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News January 5, 2026

పాక్షికంగా అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే

image

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు తుది దశకు చేరుకోవడంతో వచ్చే నెలలో వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలను పాక్షికంగా ప్రారంభించేందుకు NHAI సిద్ధమవుతోంది. హైదరాబాద్‌-వైజాగ్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ రహదారిలో మధ్య సెక్షన్ పూర్తవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త మార్గం వల్ల పాత రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.

News January 4, 2026

ఖమ్మం: 150 మంది డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు

image

రవాణా మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది డ్రైవర్లు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఎంవీఐలు దినేష్, సుమలత, రవిచందర్, వైద్యులు గౌతమ్, నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డ్రైవర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.