News February 17, 2025
పాలకొండ: నేడు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక

పాలకొండ నగర పంచాయితీలో ఖాళీగా ఉన్న ఛైర్పర్సన్ పదవికి సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఇదివరకే పాలకొండ ఛైర్పర్సన్ పదవి కోసం రెండుసార్లు ఎన్నిక జరగ్గా వివిధ కారణాలు రీత్యా వాయిదా పడింది. దీంతో మూడోసారి ఈ ఎన్నిక నిర్వహించేందుకు నేడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నిక కొలిక్కి వస్తుందా లేదా అని నగర పంచాయతీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News January 5, 2026
కవిత కన్నీరు.. గులాబీ బాస్ స్పందిస్తారా?

అసెంబ్లీ సాక్షిగా కవిత కన్నీరు పెట్టుకోవడం TG రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నైతికత కోల్పోయిన BRSలో తానుండలేనని ఆమె ఏడ్చేశారు. దీంతో పార్టీ, కుటుంబంతో తనకున్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మొదటి నుంచీ పార్టీలో కీలకంగా ఉంటూ బతుకమ్మతో మహిళలను ఏకం చేసి రాష్ట్ర ఉద్యమానికి ఊతం తెచ్చిన కవిత ఇప్పుడు ఒంటరవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గులాబీ బాస్ KCR ఎలా స్పందిస్తారో చూడాలి.
News January 5, 2026
NLG: మండలాల్లో అటకెక్కిన ప్రజావాణి

NLGలో ప్రజావాణికి వినతులు వెల్లువెత్తడంతో, గత ప్రభుత్వం మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే అనేక మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మొదట్లో మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో కొద్దిరోజులు నిర్వహించినప్పటికీ, ప్రస్తుతం అన్ని చోట్లా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు తమ సమస్యల పరిష్కారం కోసం తిరిగి జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
News January 5, 2026
వేల ఏళ్ల విశ్వాసం.. సోమనాథ్ పునరుజ్జీవనంపై మోదీ ట్వీట్!

సోమనాథ్ ఆలయంపై పాషండుల తొలి దాడి జరిగి 1000 ఏళ్లు, పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. 1026లో గజనీ మహమ్మద్ దాడి చేసినా ఎవరూ విశ్వాసం కోల్పోలేదని, అందుకే నేటికీ ఆలయం కళకళలాడుతోందని ఆయన పేర్కొన్నారు. 1951లో జరిగిన పునర్నిర్మాణం భారత ఆత్మగౌరవానికి ప్రతీక అని, సోమనాథుని దర్శనం సర్వపాప హరణమని ఆయన గుర్తుచేశారు.


