News February 17, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అధికం

image

ఉమ్మడి KNR, MDK, ADB, NZB జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌లోనే దాదాపు 45 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరూ KNR కేంద్రంగానే ప్రచారంపై దృష్టి పెడుతున్నారు. అన్ని పార్టీల అధినేతలు KNR కేంద్రంగానే తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దాదాపు 3 లక్షల 50వేల పైచిలుకు ఓట్లలో సగం ఉమ్మడి KNR జిల్లాలోనే ఉన్నాయి.

Similar News

News April 18, 2026

‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

image

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

News April 18, 2026

సంబేపల్లెలో గురుకుల విద్యార్థిని మృతి

image

సంబేపల్లె మండలం ఎర్రగుంట్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదువుతున్న రెడ్డిరాణి 14 (9వ తరగతి) విద్యార్థి శనివారం తెల్లవారుజామున మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థినికి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండడంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతి చెందినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 18, 2026

ప.గో : పెట్రోల్ బంకుల్లో జిమ్మిక్కులు…!

image

జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో సిబ్బంది జిమ్మిక్కులు చేస్తున్నారని సమాచారం. వాహనాల్లోకి పెట్రోల్ నింపకుండానే నిండినట్లుగా సొమ్ములు వసూలు చేసి, వాహనదారులు నిలదీస్తే కాళ్ల బేరానికి వస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గురువారం రాత్రి పెంటపాడు (M) అలంపురం ఒక పెట్రోల్ బంకులో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. పెట్రోలు కొట్టించి బంకు కూడా దాటకుండానే వాహనం ఆగిపోవడంతో సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది.