News February 17, 2025

కరీంనగర్: తాగుడుకు బానిసై వృద్ధుడి ఆత్మహత్య

image

శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో ముప్పిడి రామ్ రెడ్డి (72)అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరుకు చెందిన రామ్ రెడ్డి తన మేన బామ్మర్ది తుమ్మల పురుషోత్తం రెడ్డి ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యులు దూరమడం వలన మనోవేదనతో తాగుడుకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పురుషోత్తం రెడ్డి పేర్కొన్నాడు.

Similar News

News November 9, 2025

మూసాపేటలో హైడ్రాకు మద్దతు.. ప్లకార్డులతో హర్షం

image

హైడ్రాకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కబ్జాల నుంచి పార్కులను విడిపించుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డామో, ఎన్ని ఏళ్లుగా పోరాడామో హైడ్రా రావడంతో అవన్నీ మా సొంతం అయ్యాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్కులు కాపాడి ప్రాణవాయువును అందించిన హైడ్రాకు ధన్యవాదాలంటూ ర్యాలీ నిర్వహించారు. మూసాపేటలోని ఆంజనేయ నగర్‌లో పార్కుకు చేరుకుని స్థానికులు హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు.

KMR: బటన్ ప్రెస్ చేయండి.. సాయం పొందండి!

image

సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారి 161పై పసుపు పచ్చని రంగులో అక్కడక్కడ ఈ ఎమర్జెన్సీ ఫోన్ బాక్స్‌లు కనిపిస్తూ ఉంటాయి. దీని ఉపయోగాలు ఏంటంటే..? ఈ దారి గుండా ప్రయాణించే వాహనాల్లో ఇంధనం అయిపోవడం వాహనం మొరాయించడం తదితర ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈ ఫోన్ బాక్స్‌కు ఉండే తెల్లని బటన్‌ను ప్రెస్ చేసి, మన సమస్యను తెలపాలి. వెంటనే హైవే సిబ్బంది ద్వారా సహాయక చర్యలు చేపడతారు. ఈ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉంటుంది.