News February 17, 2025

అల్లూరి: అడవిరాజులబాబు పండుగపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్

image

అల్లూరి జిల్లాలో ఆదివాసీలు జరుపుకొనే అడవిరాజులబాబు పండుగపై బర్డ్ ఫ్లూ ప్రభావం కనిపిస్తోంది. కోళ్లు, మేకలను కోసి అడవుల్లో వంటలు చేసుకోవడం ఈ పండుగలో ఒక భాగం. అయితే బర్డ్ ఫ్లూ కారణంగా మార్కెట్‌లో కోళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో నాటు కోళ్లకు డిమాండ్ పెరిగింది. కాగా.. రాజవొమ్మంగిలో పండగరోజు 2,400 కిలోల మాంసం అమ్ముడుపోయేదని.. కానీ 1,200 కిలోల చికెన్ మాత్రమే అమ్ముడు పోతుందని వ్యాపారులు తెలిపారు. 

Similar News

News November 6, 2025

ఊట్కూర్: నేల మట్టమైన వరి పంట

image

ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల కారణంగా ఊట్కూరు మండల కేంద్రంలోని పెద్ద జెట్రం అమ్మనికి చెందిన రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శివారులో వేసిన వరి పొలాలు నీట మునిగి సుమారు 50 ఎకరాల వరి పంట నష్టం చేతికొచ్చిన పంటలు నీటి పాలవడంతో అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. పంట నష్టాన్ని అధికారులు వెంటనే అంచనా వేసి రైతులను ఆదుకోవాలని మాజీ MPTC కిరణ్ డిమాండ్ చేశారు.

News November 6, 2025

IMMTలో 30 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(<>IMMT<<>>)లో 30 పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించింది. అర్హతగల అభ్యర్థులు NOV 21 వరకు అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్, Sr సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, ఎంటెక్, BE, బీటెక్ , PhD ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.immt.res.in/

News November 6, 2025

ఊట్కూర్: మారనున్న పెద్ద చెరువు రూపురేఖలు

image

నారాయణపేట -కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా ఊట్కూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువును విస్తరించి రిజర్వాయర్‌గా మార్చనున్నారు. దీని నిలువ సామర్థ్యం 0.27 టీఎంసీలు. 19 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడి నుంచి ప్రెషర్ మెయిన్ పద్ధతిలో జయమ్మ చెరువు, కానుకుర్తి, దౌల్తాబాద్ ఎత్తిపోస్తారు. భూసేకరణ జరిగిన, డబ్బు రైతు ఖాతాలో జమ కాలేదు.