News February 17, 2025

మటన్ షాపులకు ఎగబడ్డ జనం.. విపరీతంగా పెరిగిన రేట్లు!

image

బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ విక్రయాలు అమాంతం పడిపోగా మటన్, రొయ్యలు, చేపల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ప.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కేజీ మటన్ గరిష్ఠంగా రూ.1200 వరకు విక్రయించినట్లు తెలుస్తోంది. చేపలు కేజీ సాధారణంగా రూ.130గా ఉంటే రూ.180కి, రొయ్యలు రూ.250గా ఉంటే రూ.350కి పెంచి అమ్మారు. ధర ఎక్కువయినప్పటికీ బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వీటి కొనుగోళ్లకే మొగ్గు చూపారు. చికెన్ షాపులు వెలవెలబోయాయి.

Similar News

News February 21, 2025

మొగల్తూరు : పేరుపాలెం బీచ్ సమీపంలో వ్యక్తి సూసైడ్

image

పేరుపాలెం బీచ్ సమీపంలోని కొబ్బరితోటలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపిన వివరాలు.. రిసార్ట్ సమీపంలోని సీఆర్ జెడ్ పరిధిలోని తోటలో గుళికలు తిని మృతిచెందాడు. అయితే అతని జేబులో ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు ఉందని , ఫోన్ లాక్ ఓపెన్ కాలేదని వీఆర్వో దుర్గారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడిది కృష్ణా జిల్లా కృతివెన్నుగా అనుమానిస్తున్నారు.

News February 21, 2025

భీమడోలు: కుళ్లిన ఎగ్ పఫ్ విక్రయాలు

image

భీమడోలు జంక్షన్‌లోని ఓ బేకరీలో గురువారం రాత్రి కుళ్లిన ఎగ్ పఫ్‌లను విక్రయించడం వివాదాస్పదమైంది. భీమడోలు మండలం పెదలింగంపాడు గ్రామానికి చెందిన పులిపాటి రాజు అనే వ్యక్తి ఎగ్ పఫ్‌లను కొని ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లలు వాటిని తినే సమయంలో దుర్వాసన రావడంతో ఊసేశారు. దీంతో రాజు బేకరీ వద్దకు వెళ్లి, వ్యాపారిని నిలదీశాడు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రాజు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

News February 21, 2025

పా.గో: గవర్నర్‌కు మాజీ మంత్రుల వినతులు

image

వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైయస్ జగన్‌కి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

error: Content is protected !!