News March 20, 2024
రాజంపేట: వృద్ధుడు కనిపించడం లేదని ఫిర్యాదు

చిట్వేల్ మండలం దొగ్గలపాడుకు చెందిన కొండ్రెడ్డి నర్సింహా రెడ్డి (56) కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందిందని రాజంపేట పట్టణ ఎస్సై తెలిపారు. ఈ నెల 13 నుంచి వృద్ధుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. తెల్ల రంగు పంచ, చొక్కా ధరించి ఉన్నాడని తెలిపారు. ఆచూకీ తెలిస్తే 91211 00570కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు.
Similar News
News March 1, 2026
కడప జిల్లాలో కీలక పోస్టుల్లో ఇన్‌ఛార్జ్‌ల పాలన.!

కడపలో 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన జిల్లాలోని పలువురు అధికారులు హైకోర్టు ఆదేశాలతో GADలో రిపోర్ట్ చేశారు. కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్‌రెడ్డి స్థానంలో KMC కమిషనర్ రాకేశ్ చంద్రం, ప్రొద్దుటూరు RTO మనీషా స్థానంలో MVI నారాయణ నాయక్, జమ్మలమడుగు RDO శిరీషా స్థానంలో పులివెందుల RDO చిన్నయ్య, కడప RDO జాన్ స్థానంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావనకు అదనపు బాధ్యతలు(FAC) అప్పగించారు.
News February 28, 2026
పుష్పగిరి: ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరులు

వల్లూరు మండలం పుష్పగిరి సంతాన మల్లేశ్వర ఆలయం వద్ద ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరుని రూపాలు ఉండటం అత్యంత అరుదని చరిత్రకారుడు బి.రమేష్ తెలిపారు. అర్చకులు అఖిల్ స్వామి సమాచారంతో పరిశోధించిన ఆయన ఈ శిల్పం పశుత్వం నుంచి దైవత్వానికి మారడాన్ని సూచిస్తుందన్నారు. చారిత్రక దాడుల్లో నంది ముఖం ధ్వంసమైనా లింగధారినంది, అద్భుతమైన హారాలు, అర్ధ పద్మాసనంలో ఉన్న నందికేశ్వరుని శిల్పకళ విశేషంగా ఆకర్షిస్తుందన్నారు.
News February 28, 2026
కడప జిల్లాలో నేటి ఇంటర్ పరీక్షలకు 4,470 మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ బోటనీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,626 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,470 మంది రాశారు. 156 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 3,473 మందికి గాను.. 3,383 మంది పరీక్షలకు హాజరయ్యారు. 93 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,153 మందికి గాను.. 1,087 మంది పరీక్షలు రాశారు. 66 మంది ఆబ్సెంట్ అయ్యారు.


