News February 17, 2025

HAPPY BIRTHDAY KCR: CM రేవంత్ రెడ్డి

image

గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Similar News

News April 18, 2026

1 Min లేటైనా CETకు అనుమతి లేదు

image

AP: Eng, Agri తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET ఇతర పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని APSCHE స్పష్టం చేసింది. CETలపై ఇవాళ కన్వీనర్లతో సమీక్షించి షెడ్యూల్ జారీ చేసింది. EAPCET-Eng మే 12-15, 18, Agri& phm మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. ECET APR 23, PGECET APR 28-30, ICET మే 2, లాసెట్ మే4, EDCET మే 8, PGCET మే 8-11తేదీల్లో జరుగుతాయి.PGCET 3, ఇతర సెట్లన్నీ 2 షిఫ్ట్‌లలో ఉంటాయి.

News April 18, 2026

సంతమాగులూరులో కుళ్లిన మృతకళేబరం కలకలం

image

సంతమాగులూరు మండలంలోని కొప్పరం నుంచి సజ్జాపురం వెళ్లే మార్గంలో ఉన్న చెరువులో కుళ్లిన కళేబరం శుక్రవారం కలకలం రేపింది. ఎముకుల గూడుతో ఉన్న డెడ్‌బాడీని పశువుల కాపరి చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. అనంతరం విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. దీనిపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2026

మహిళా రిజర్వేషన్: 2034 వరకు ఆగాల్సిందేనా?

image

2026 జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యాకే ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ చట్టం అమల్లోకి వస్తుందని అప్పట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. తాజాగా 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో 2029లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కష్టమని, 2034 వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటివరకు మహిళలు వేచి చూడాల్సిందేనేమో!