News February 17, 2025
GWL: బీజేపీ ఫ్లెక్సీలు చింపివేత.!

బీజేపీ శ్రేణుల ఎదుగుదలను ఓర్వలేక ఫ్లెక్సీలను చింపి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆ పార్టీ అయిజ పట్టణ అధ్యక్షుడు కంపాటి భగత్ రెడ్డి పేర్కొన్నారు. తిక్క వీరేశ్వర స్వామి ఉత్సవాలకు భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం అర్ధరాత్రి దుండగులు చింపివేశారని ఆవేదన చెందారు. ఇలాంటి చర్యలు అరికట్టేందుకు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు కోరినా పట్టించుకోవడం లేదన్నారు.
Similar News
News January 18, 2026
పాక్ సరిహద్దుల్లో AK-47 రైఫిళ్లు, పిస్టళ్లు లభ్యం

పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా సంస్థలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో 3 AK-47 రైఫిళ్లు, 5 మ్యాగజైన్లు, తుర్కియే, చైనా తయారీ పిస్టళ్లు, 98 బుల్లెట్లు లభ్యమయ్యాయి. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాక్ నుంచి ఈ ఆయుధాలను పంపినట్లు అధికారులు భావిస్తున్నారు. పాక్ గూఢచార సంస్థ ISI అండ ఉన్న ఉగ్రవాదుల పనేనని అనుమానిస్తున్నారు.
News January 18, 2026
HYDలో ఆదివారం AQ @189

HYDలో ఎయిర్ క్వాలిటీ గత వారంతో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ నగరంలో ఆదివారం తెల్లవారుజామున 189గా నమోదైంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాహనాల రద్దీ, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ తగ్గడంతో HYD ఊపిరితీసుకుంటోంది.
News January 18, 2026
4రోజుల్లో రూ.82కోట్లు కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలై 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ‘సంక్రాంతి రారాజు బాక్సాఫీస్ ధమాకా పేలుతూనే ఉంటుంది’ అని క్యాప్షన్ పెట్టింది. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించారు.


