News February 17, 2025

పలమనేరు: బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన విద్యార్థిని

image

విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చి తాను కన్నుమూసిన ఘటన పలమనేరులో చోటు చేసుకుంది. మండలంలో ఓ బాలిక(16) ప్రభుత్వ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఈక్రమంలో విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. పురిటి నొప్పులు అధికమవడంతో బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యుల సిఫార్సుతో చిత్తూరుకు తరలించారు. రక్తస్రావం అధికమవడంతో శిశువుకు జన్మనిచ్చి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

Similar News

News January 17, 2026

చిత్తూరు: సింగిరి గుంట వద్ద రోడ్డు ప్రమాదం.. పరిస్థితి విషమం

image

చౌడేపల్లె మండలంలోని సింగిరి గుంట వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News January 16, 2026

చిత్తూరు: గొర్రెల మందపై చిరుత దాడి!

image

పులిచెర్ల మండలం పాలెం పంచాయతీ సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందగా మరొక గొర్రెకు తీవ్ర గాయాలయ్యాయి. పాల్యంకు చెందిన కృష్ణయ్య తన 40 గొర్రెలను శుక్రవారం అడవుల్లోకి తోలుకెళ్లాడు. సాయంత్రం చిరుత దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందిందని, మరొక గొర్రెకు గాయాలయ్యాయన్నారు. ఇంకో గొర్రె అదృశ్యమైనట్లు గుర్తించామని రైతు తెలిపారు.

News January 16, 2026

CTR: మామిడి రైతులకు బకాయిలు అందేనా.?

image

మామిడి రైతులకు పల్ప్ ఫ్యాక్టరీలు అందించాల్సిన బకాయిలు ఇంతవరకు అందకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో సీజన్ ప్రారంభానికి సిద్ధమైనా ఇంతవరకు ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించడం లేదు. రూ.50 కోట్ల వరకు బకాయిలు రైతులకు ఫ్యాక్టరీలు అందించాల్సి ఉంది. గత సీజన్లో ప్రభుత్వం కిలో తోతాపూరికి రూ.4 రాయితీ చెల్లించగా.. ఫ్యాక్టరీలు రూ.8 చెల్లించాలని ఆదేశించింది.