News February 17, 2025
Stock Markets: వరుసగా 9వ రోజూ ఢమాల్..

స్టాక్ మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజూ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, అనిశ్చితి కొనసాగుతుండటమే ఇందుకు కారణం. సూచీలపై బేర్స్ పట్టు సాధించడంతో నిఫ్టీ 22,748 (-182), సెన్సెక్స్ 75,326 (-602) వద్ద చలిస్తున్నాయి. ఫియర్ ఇండెక్స్ India VIX 7.90% పెరిగి 16.20కు చేరుకుంది. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్స్.
Similar News
News October 18, 2025
కల్తీ మద్యం కేసు: ప్రధాన నిందితుడితో జోగి రమేశ్ ఫొటోలు!

AP: కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు, అతడి సోదరుడు జగన్మోహన్ రావుతో మాజీ మంత్రి జోగి రమేశ్ కలిసి ఉన్న ఫొటోలు బయటపడ్డాయి. ఓ వేడుకలో వీరు పక్కపక్కనే కూర్చున్నారు. కాగా జనార్దన్‌తో సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని రమేశ్ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు రమేశ్ ఆధ్వర్యంలోనే కల్తీ మద్యం తయారు చేశామని జనార్దన్ వెల్లడించడం గమనార్హం.
News October 18, 2025
‘వృక్షరాణి’ తులసి తిమ్మక్క గురించి తెలుసా?

మనకెంతో ఇచ్చిన ప్రకృతిని కాపాడేందుకు ఒక్క మొక్కనైనా నాటలేకపోతున్నాం. కానీ కర్ణాటకకు చెందిన 113ఏళ్ల తులసి తిమ్మక్క తన జీవితాన్నే మొక్కలు నాటేందుకు త్యాగం చేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గత 80 ఏళ్లలో ఈ ‘వృక్షరాణి’ 8,000 కంటే ఎక్కువ మొక్కలు నాటి బీడు భూములను పచ్చగా మార్చారు. పిల్లలు లేని లోటును తీర్చుకునేందుకు ఆమె చెట్లను దత్తత తీసుకున్నారు. ఆమెను కేంద్రం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
News October 18, 2025
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

AP: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు యాక్ట్‌ను సవరిస్తూ <