News February 17, 2025
VKB: పన్ను వసూలులో వెనుక ఉన్న మండలాలు ఇవే..!

వికారాబాద్ జిల్లాలో 2024-25లో మర్పల్లి, తాండూర్, పెద్దముల్, కొడంగల్, పూడూర్, యాలాల్, దౌల్తాబాద్, పరిగి, దోమ, మోమిన్ పేట్, బొమ్రాస్ పెట్, కులక్చర్ల, కోటపల్లి మండలాలు పంచాయతీ పన్నువసూళ్ల వెనుకంజలో ఉన్నాయి. పన్ను వసూలులో ప్రధాన కారణం గ్రామాల్లో వివిధ రకాల సర్వేలు నిర్వహించడంతో ఆలస్యమైనట్లు పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
Similar News
News September 15, 2025
NLG: దసరా వస్తోంది.. జీతాలేవీ..?

NLG జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామాలు స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను తమపై వేసుకుని జిల్లాలో 868 జీపీల్లో పనిచేసే కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. తక్కువ జీతం సైతం సకాలంలో రాక కుటుంబ పోషణకు అప్పులు చేస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తుండడంతో నూతన వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేద్దామంటే చేతిలో డబ్బులు లేక దిక్కులు చూస్తున్నారు.
News September 15, 2025
కాణిపాకంలో రేపు లడ్డూ వేలంపాట

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.
News September 15, 2025
రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.