News February 17, 2025
గైర్హాజరైన విద్యార్థులకు ప్రత్యేక ప్రయోగ పరీక్షలు

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రయోగ పరీక్షల్లో గైర్హాజరైన విద్యార్థులకు మరొక అవకాశంగా ప్రత్యేక బ్యాచ్ ప్రయోగ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. మూడు విడుతల్లో నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో పలువురు విద్యార్థులు అనారోగ్య, తదితర కారణాల వల్ల గైర్హాజరయ్యారని, వారందరికీ ప్రత్యేక బ్యాచ్‌గా స్థానిక ఏవీవీ జూ.కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 12, 2025
WGL: గ్రూప్-2లో BC(A) విభాగంలో SIకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడో బెటాలియన్ రిజర్వ్డ్ ఎస్సై BC(A)లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్పల్లి ఏడో బెటాలియన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. వరంగల్ జిల్లాకు ఏం కావాలంటే?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని పెండింగ్ పనులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. WGL కలెక్టరేట్, నూతన బస్టాండ్, సూప్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలని, కాజీపేట రైల్వే ఫ్లై-ఓవర్ చేపట్టాలని కోరుతున్నారు. టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
News March 12, 2025
ఎడ్ల బండ్ల ప్రబలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

WGL(D) గీసుగొండ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రత్యేకమైనది. ఉమ్మడి జిల్లా నుంచి ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి రావడం ఆనవాయితీ. జిల్లాలోని లంబాడా జాతులవారు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదయం హోలీ జరుపుకున్న తర్వాత నుంచి జాతరకు పోటెత్తుతారు. కోలాటాలు, లంబాడా నత్యాలతో ఆలయం చుట్టూ ప్రబలు తిరుగుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మరి జాతరకు మీరు వెళ్తున్నారా?