News March 20, 2024
‘లెజెండ్’ మళ్లీ వస్తోంది

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో సూపర్ హిట్ కొట్టిన సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రం తాజాగా రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2014 ఎన్నికలకు ముందు విడుదలైన ఈ చిత్రం పొలిటికల్ డైలాగ్‌లతో భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
Similar News
News July 7, 2025
గ్రూప్-1పై తీర్పు రిజర్వ్

TG: గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న పిటిషన్లపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. మెయిన్స్ జవాబు పత్రాలను పున:మూల్యాంకనం చేయాలని, లేదంటే మళ్లీ పరీక్షలు పెట్టాలని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై గతంలో జడ్జి జస్టిస్ రాజేశ్వరరావు స్టే విధించారు. దీన్ని సవాలు చేస్తూ ఎంపికైన అభ్యర్థులు పిటిషన్లు వేశారు. ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.
News July 7, 2025
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం: అచ్చెన్న

AP: మాజీ సీఎం జగన్ రైతు ఓదార్పు యాత్రల పేరుతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా జగన్ చేయలేదన్నారు. వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తాము మిర్చి, మామిడి, కోకో, పొగాకు రైతులకు న్యాయం చేశామని వివరించారు. జగన్‌ను నిలదీయాలని రైతులకు మంత్రి సూచించారు.
News July 7, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹540 తగ్గి ₹98,290కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 తగ్గి ₹90,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.