News February 17, 2025

MPTC, ZPTC ఎన్నికలు: వికారాబాద్ జిల్లా UPDATES

image

తెలంగాణలో MPTC, ZPTC ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వికారాబాద్ జిల్లా తుది జాబితా పోలింగ్ బూత్ వివరాలు వెల్లడించారు.
జడ్పీటీసీ-20
ఎంపీటీసీ-227
పోలింగ్ బూత్‌లు-1288
ఓటర్లు-699894

Similar News

News April 16, 2026

BREAKING: లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు.. వాడీవేడీ చర్చ

image

లోక్‌సభలో మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిని చర్చకు అనుమతించడంపై కేంద్ర మంత్రులు, ప్రతి‌పక్ష ఎంపీల మధ్య వాడీవేడీగా చర్చ జరుగుతోంది. మొత్తం మూడు బిల్లులపై లోక్‌సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటలపాటు చర్చ, ఆపై ఓటింగ్ జరగనుంది.

News April 16, 2026

మైదుకూరు: ఇంటర్‌లో ఫెయిల్.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

image

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన జి. హరి ఈశ్వర్(18) సమీపంలోని చెరువులో పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం విడుదలైన ఫలితాలలో ఫెయిల్ అవ్వడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే ఈశ్వర్ తండ్రి మునెయ్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు.

News April 16, 2026

రాజమండ్రి: 76 ఏళ్ల రుచి.. దీని వెనుక స్టోరీ తెలుసా?

image

రాజమండ్రి రోజ్ మిల్క్ రుచి వెనుక ఒక చారిత్రక కథ ఉంది. 1950లో గుబ్బ సింహాచలం అనే వ్యక్తి పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థుల నుంచి ఈ తయారీ రహస్యాన్ని నేర్చుకున్నారు. సుగంధి వేర్లు, స్వచ్ఛమైన పాలు, కోవాల కలయికతో తోపుడు బండిపై మొదలైన ఈ వ్యాపారం నేడు నగరానికే ఒక బ్రాండ్‌గా మారింది. 76 ఏళ్లుగా రోజ్ మిల్క్ గోదావరి ప్రజల మనసు గెలుచుకుంటోంది.