News February 17, 2025
ఉప్పల్‌లో 9 మ్యాచులు ఉన్నా SRH ఫ్యాన్స్‌కు నిరాశే..

IPL 2025 షెడ్యూల్ ప్రకారం ఉప్పల్ వేదికగా 9 మ్యాచులు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే HYDలో లీగ్ దశలో ఆర్సీబీ, సీఎస్కేతో ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం SRH అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈ టీమ్స్‌లోనే ధోనీ, కోహ్లీ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. అయితే MIతో ఏప్రిల్ 23న మ్యాచ్ ఉండటం కాస్త ఊరటనిస్తోంది. మరి ఉప్పల్ వేదికగా జరిగే క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆ జట్లతో తలపడుతుందేమో చూడాలి.
Similar News
News January 24, 2026
468రోజుల తర్వాత సూర్యకుమార్ హాఫ్ సెంచరీ

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ రెండో T20లో పరుగుల వరద పారించారు. 23 ఇన్నింగ్సుల(468 రోజులు) సుధీర్ఘ ఎదురు చూపులకు హాఫ్ సెంచరీతో చెక్ పెట్టారు. అది కూడా 23 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. T20WC నేపథ్యంలో తన ఫామ్‌పై వస్తున్న అనుమానాలను ఈ ఇన్నింగ్స్‌తో పటాపంచలు చేశారు. అలాగే సూర్య భారత్ తరఫున అత్యధిక T20I మ్యాచులు(126) ఆడిన లిస్ట్‌లో కోహ్లీ(125)ని దాటేశారు. రోహిత్(159) తొలిస్థానంలో ఉన్నారు.
News January 24, 2026
జనవరి 24: చరిత్రలో ఈరోజు

1757: బొబ్బిలి యుద్ధం ప్రారంభం
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించిన భారత ప్రభుత్వం
1966: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(ఫొటోలో) బాధ్యతలు స్వీకరణ
1966: అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా మరణం
1981: సినిమా నటి కాంచనమాల మరణం
* జాతీయ బాలికా దినోత్సవం
News January 24, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


