News February 17, 2025

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం

image

శ్రీశైలం మహా క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరగనునున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం చంద్రబాబుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం శ్రీనివాసరావు ఆహ్వానపు పత్రికను అందజేశారు. ఈమేరకు అమరావతిలోని వెలగపూడిలో గల సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు.

Similar News

News November 6, 2025

ఖమ్మం: స్కూటీ రిపేర్ చేయలేదని షో రూమ్‌కు తాళం

image

ఖమ్మంలో గురువారం వినూత్న ఘటన జరిగింది. తన ఎలక్ట్రికల్ స్కూటీని రిపేర్ చేయలేదన్న కారణంగా ఓ వ్యక్తి ఏకంగా షోరూమ్‌కు తాళం వేశాడు. బోనకల్ మండలం రావినూతలకి చెందిన కొమ్మినేని సాయి కృష్ణ నాలుగు నెలల క్రితం స్కూటీ కొనుగోలు చేశారు. రిపేరు రావడంతో షోరూమ్ సిబ్బందిని సంప్రదించగా, అది తమ పరిధిలో రిపేరు కాదని వారు తెలిపారు. దీంతో అసహనానికి గురైన సాయి కృష్ణ ఆ షోరూమ్‌కు తాళం వేసినట్లు సమాచారం.

News November 6, 2025

GNG: ఓటర్ల జాబితాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

image

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు జాబితా పునశ్చరణపై గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను సి.ఈ.ఓ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటింటా ఓటర్ల సర్వే విచారణ జరపాలన్నారు. బిఎల్‌ఓలు ఇంటింటా సర్వే చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బుక్ కాల్ విత్ బిఎల్‌ఓ అవకాశాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.

News November 6, 2025

స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ‌కు అధికారులు సన్నద్ధం కావాలి: కలెక్టర్

image

ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స్పెష‌ల్ సమ్మ‌రీ రివిజ‌న్‌-ఎస్ఐఆర్‌) ప్ర‌క్రియ‌పై పూర్తిస్థాయి అవ‌గాహ‌న పెంపొందించుకొని పూర్తి సన్నద్ధతతో ఉండాల‌ని క‌లెక్ట‌ర్ షాన్ మోహన్ అధికారుల‌కు సూచించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సీఈవో వివేక్ యాద‌వ్‌.. సచివాలయం నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లతో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి ఆయన కాకినాడ తన క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు.