News February 17, 2025
ఫుడ్ డెలివరీ సంస్థలకు ‘చికెన్’ దెబ్బ!

తెలుగు రాష్ట్రాల ప్రజలను ‘బర్డ్ ఫ్లూ’ భయం వెంటాడుతోంది. కొంతకాలం చికెన్ తినకపోవడమే బెటర్ అని చాలామంది దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం చికెన్ దుకాణాలపైనే కాకుండా ఫుడ్ డెలివరీ సంస్థలపైనా పడింది. జొమాటో, స్విగ్గీ తదితర యాప్స్‌లో చికెన్ ఐటమ్స్ ఆర్డర్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. బదులుగా ఫిష్, మటన్ వంటకాలు ఆర్డర్ చేస్తున్నారు. అటు చికెన్ ఆర్డర్లు లేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ వెలవెలబోతున్నాయి.
Similar News
News January 7, 2026
రప్ఫాడిస్తున్న రింకూ

విజయ్ హజారే ట్రోఫీలో యూపీ కెప్టెన్‌గా రింకూ సింగ్ అదరగొడుతున్నారు. వరుసగా 6 విజయాలతో గ్రూప్-Bలో 24 పాయింట్లతో టీమ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా 67(48), 106*(60), 63(67), 37*(15), 41(35), 57(30) పరుగులు చేశారు. ప్రతి మ్యాచ్‌లోనూ తన మార్క్ బ్యాటింగ్, కెప్టెన్సీతో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. రాబోయే T20WCలోనూ ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
News January 7, 2026
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్?

APలో మరో మెగా DSCకి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది 9వేల మందికిపైగా టీచర్లు రిటైర్ కానున్నారు. అలాగే 9,200 ప్రైమరీ స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్చిన తర్వాత ఉపాధ్యాయులు అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో FEB రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈసారి DSCలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానంపై ఓ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు సమాచారం.
News January 7, 2026
‘MSVG’ ప్రమోషన్లకు దూరంగా చిరు.. అందుకేనా?

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల వెన్నెముక భాగంలో చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు నేరుగా హాజరు కావడం లేదని టీటౌన్ వర్గాల్లో డిస్కషన్. త్వరలో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


