News February 17, 2025
అనకాపల్లిలో 25 మందిపై కేసుల నమోదు

అనకాపల్లి టౌన్ పరిధిలో బహిరంగ ప్రాంతాల్లో మద్యం తాగిన 25 మందిపై కేసులు నమోదు చేసినట్లు ట్రైనీ డీఎస్పీ M.V Krishna చైతన్య వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం వివిధ ధాబాలు, ఇతర ప్రాంతాల్లో సిబ్బందితో దాడులు చేశామన్నారు. పలుచోట్ల మద్యం తాగుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశామని తెలిపారు.
Similar News
News September 19, 2025
అమెరికాలో గొడవ.. పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి

మహబూబ్‌నగర్ (TG)కు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికా పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. MS చేసేందుకు 2016లో USకు వెళ్లిన అతడు జాబ్ లేకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ‘రూమ్మేట్స్ మధ్య గొడవ జరుగుతోందని SEP 3న కాల్ వచ్చింది. నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేస్తున్నాడు. కంట్రోల్ చేసేందుకు కాల్పులు జరిపాం. గాయాలతో అతడు మరణించాడు’ అని పోలీసులు తెలిపారు.
News September 19, 2025
పాడేరు: గ్యాస్ అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు

గ్యాస్ సిలిండర్‌ను కంపెనీ ఇచ్చిన రేట్ల కన్నా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ డీలర్లను హెచ్చరించారు. గురువారం పాడేరులోని కలెక్టరేట్లో పౌర సరఫరాల అధికారులు, గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. గ్యాస్‌కు అదనంగా వసూలు చేస్తున్నారని లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
News September 19, 2025
హసన్‌పర్తి: గంజాయి రవాణాదారులకు పదేళ్ల జైలు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి శివారులో 2017లో గంజాయి రవాణా చేస్తున్న నలుగురికి 8 సంవత్సరాల తర్వాత పదేళ్ల జైలు శిక్ష పడింది. నేరం రుజువుకావడంతో, నిందితులైన లావుడ్య భద్రమ్మ, దుప్పటి మల్లయ్య, బొల్ల అయిలయ్య, దాసరి కుమారస్వామికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పునిచ్చారు.