News February 17, 2025
రేపు అమెరికా, రష్యా ప్రతినిధుల భేటీ

రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ఈమేరకు రేపు సౌదీఅరేబియాలో అమెరికా, రష్యా ప్రతినిధులు భేటీ కానున్నారు. యుద్ధం ముగింపుతో పాటు ఇరు దేశాల సంబంధాలపైనా చర్చించనున్నారు. మరోవైపు బైడెన్ హయాంలో ఉక్రెయిన్‌కు US నుంచి సాయం అందగా ట్రంప్ అధికారంలోకి రాగానే నిలిచిపోయింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈయూ దేశాల సాయం కోరుతున్నారు.
Similar News
News March 13, 2025
రోజూ చికెన్ తింటున్నారా?

చికెన్ అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. అయితే రోజూ చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి ఎముకలు, కీళ్ల సమస్యలు వస్తాయంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చికెన్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.
News March 13, 2025
నేటి నుంచి 5 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో నేటి నుంచి 18 వరకు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణ్ పేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.
News March 13, 2025
డిజిటల్ మోసాల్లో 83,668 వాట్సాప్ అకౌంట్లు బ్లాక్: బండి

డిజిటల్ అరెస్ట్ స్కాముల్లో 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు హోంశాఖ వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీ అధికారులుగా నటిస్తూ మోసాలకు పాల్పడినట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ డీఎంకే ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటివరకు సైబర్ నేరాలపై 13.36 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని చెప్పారు. సుమారు రూ.4,386 కోట్ల నష్టాన్ని నివారించినట్లు తెలిపారు.