News February 17, 2025
Stock Markets: హమ్మయ్య.. నష్టాలకు తెర!

ఎట్టకేలకు నష్టాలకు తెరపడింది. స్టాక్‌మార్కెట్లు నేడు లాభపడ్డాయి. ఉదయం 180 Pts పతనమైన నిఫ్టీ 22,959 (+30), 600 pts కోల్పోయిన సెన్సెక్స్ 75,996 (+57) వద్ద ముగిశాయి. ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. M&M, ఎయిర్‌టెల్, ఇన్ఫీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ లూజర్స్.
Similar News
News January 13, 2026
Photo Gallery: సంక్రాంతి సంబరాల్లో సీఎం

AP: తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో CM చంద్రబాబు పాల్గొని వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. ఇందులో చంద్రబాబు, బాలయ్య మనవళ్లు కూడా పాల్గొన్నారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి గిఫ్ట్స్ అందజేశారు.
News January 13, 2026
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<
News January 13, 2026
‘జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ <<18824314>>ఆరోపణల్లో<<>> నిజం లేదని ఆమె మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్ అన్నారు. ‘ఆమెకు జూనియర్ బాక్సర్‌తో వివాహేతర సంబంధం ఉండేది. ఫ్యామిలీ సర్దిచెప్పినా మళ్లీ మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. అందుకు నా దగ్గర వాట్సాప్ మెసేజ్ ప్రూఫ్‌లు కూడా ఉన్నాయి. ఒంటరిగా ఉంటూ అక్రమ సంబంధాలు నడిపించాలనుకుంది. అందుకే విడాకులు తీసుకుంది’ అని IANS ఇంటర్వ్యూలో చెప్పారు.


