News February 17, 2025

అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీ ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం HYD లింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడ ఏర్పాటుచేసిన భారీ సెట్‌లో 20 రోజుల పాటు చిత్రీకరణ జరగనుందని సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుత షెడ్యూల్ మార్చి చివరి వారం వరకూ కొనసాగనుందని వెల్లడించాయి.

Similar News

News April 16, 2026

తమిళనాడులో TVK విజయ్ మ్యానిఫెస్టో.. పెళ్లికి 8 గ్రా. బంగారం

image

*60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళలకు నెలకు రూ.2,500
*ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు
*పేదవారి పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టు చీర
*ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు
*పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిస్తే ఏడాదికి రూ.15వేలు
*ఉన్నత విద్యకు రూ.20 లక్షల వరకు లోన్లు
*రాష్ట్రవ్యాప్తంగా 100 రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు
*రైతుల పంట రుణాలు మాఫీ

News April 16, 2026

భగ్గుమన్న భానుడు.. సీజన్లో తొలిసారి..

image

తెలంగాణలో భానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఈ సీజన్లో తొలిసారి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2-3 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

News April 16, 2026

మల్లె సాగు – దిగుబడి పెరగాలంటే..

image

మల్లె నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్ది దిగుబడి పెరుగుతుంది. మూడో ఏడాది నుంచి 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. తాజా పువ్వుల కోసం పూర్తిగా అభివృద్ధి చెంది తెరవని మొగ్గలను ఉదయాన్నే 11 గంటల లోపలే కోయాలి. లేకపోతే పువ్వుల నాణ్యత తగ్గిపోతుంది. దిగుబడి పెంచుటకు లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ 2.5గ్రా, మెగ్నీషియం సల్ఫేట్ 5గ్రా. సూక్ష్మదాతువులను కలిపి 2,3 దఫాలుగా పిచికారీ చేయాలి.