News March 20, 2024

జిల్లాలో సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయండి: ఎస్పీ

image

జిల్లాలో ఎన్నికల వేళ ఎక్కడైనా ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు ఆగడాలు, దౌర్జన్యాలు చేస్తున్నా, పాత పంథా కొనసాగిస్తున్నా, ఏదైనా హింస, అల్లర్లు, గొడవలకు పాల్పడుతున్నా వెంటనే తమకు ఈ నంబర్ ద్వారా  9440796800 సమాచారం పంపాలన్నారు. సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు.

Similar News

News September 4, 2025

జిల్లా బెస్ట్ టీచర్ అవార్డుకు 76 మంది ఎంపిక

image

అనంతపురం జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డుకు 76 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. టీచర్స్ డే సందర్భంగా వీరికి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో అవార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం 9 గంటలకు కళాశాలకు హాజరు కావాలన్నారు. ప్రతి ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

News September 4, 2025

మిలాద్-ఉన్-నబీ పర్వదినాన పటిష్ఠ చర్యలు: ఎస్పీ

image

ఈనెల 5న జరిగే మిలాద్-ఉన్-నబీ పర్వదినాన ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ బందోబస్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఎస్పీ పి.జగదీశ్ ఆదేశించారు. శాంతి కమిటీల సమావేశాలు నిర్వహించి, మతసామరస్యంతో పండుగ ర్యాలీ కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినాన ముస్లింలు నిర్వహించే ర్యాలీలు, ఊరేగింపులు జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.

News September 3, 2025

అనంతపురం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..!

image

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అనంతపురం జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. పామిడిలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న యాదవ్ అరుణ, ఆత్మకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉప్పరపల్లి శైలజ, గుత్తి మండలం అబ్బేదొడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బండి శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈనెల 5న సీఎం చేతుల మీదుగా విజయవాడలో అవార్డులు అందుకోనున్నారు.