News February 17, 2025
HYDలో చెత్త బండి.. ఇదే వీరి బతుకు బండి..!

గ్రేటర్ HYDలో GHMC స్వచ్ఛ ఆటోల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దుర్గంధ భరితపు వాసనను భరిస్తూ ఇబ్బందులు పడుతూ ఇంటి నుంచి చెత్త సేకరించి, నగర స్వచ్ఛతకు బాసటగా నిలుస్తారు. HYDలో ఓ స్వచ్ఛ ఆటోలో చెత్త బ్యాగులపైన బాలుడు ఉండటం వారి కష్టానికి నిదర్శనం అని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. CREDIT:ఫోటో జర్నలిస్ట్ లోగనాథన్
Similar News
News November 15, 2025
‘శివ’ రీరిలీజ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.2.50కోట్లు

ఆర్జీవీ-నాగార్జున కాంబోలో తెరకెక్కిన ‘శివ’ మూవీ రీరిలీజ్‌లోనూ అదరగొట్టింది. నిన్న తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని దేశాల్లోనూ ఈ కల్ట్ క్లాసిక్‌కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇదే జోరు కొనసాగితే రూ.10 కోట్ల వసూళ్లు చేయడం గ్యారంటీ అని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా 1989లో విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
News November 15, 2025
మైనర్ డ్రైవింగ్ తీవ్ర నేరం: కర్నూలు ఎస్పీ

మైనర్ డ్రైవింగ్ చట్ట ప్రకారం తీవ్ర నేరమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. 2025 జనవరి–అక్టోబర్ మధ్య జిల్లాలో 675 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను, యజమానులను ఆయన సూచించారు. రెండోసారి పట్టుబడితే ₹5,000 జరిమానా ఉంటుందని హెచ్చరించారు.
News November 15, 2025
కామారెడ్డి: రాజీమార్గమే రాజమార్గం

రాజి మార్గమే రాజమార్గమని కామారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ వరప్రసాద్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కోర్టులో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. దీని ద్వారా కేసులను పరిష్కారించుకోవాలని ఆయన సూచించారు.


