News February 17, 2025

HYD: మార్చి నాటికి DPRలు సిద్ధం: ఎండీ

image

CM రేవంత్ రెడ్డి సూచన మేరకు HYDలో మెట్రో విస్తరణకు శరవేగంగా అడుగులు పడుతున్నాయని మెట్రో ఎండీ NVS రెడ్డి అన్నారు. HYDలో గ్రీన్ తెలంగాణ సమ్మిట్-2025లో పాల్గొన్న ఆయన మార్చి నాటికి DPRలు సిద్ధం కానున్నట్లు తెలిపారు. ఓవైపు మేడ్చల్, మరోవైపు శామీర్‌పేట ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేస్తామని, మరోవైపు శంషాబాద్ ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు.

Similar News

News November 5, 2025

2,500 విద్యాసంస్థలు మూతబడ్డాయి.. బండి సంజయ్ ఫైర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నీరుగార్చుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ‘రాష్ట్ర చరిత్రలో తొలిసారి 2,500 విద్యాసంస్థలు మూతబడ్డాయి. BRS పాలనలో రెండేళ్లు, కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాక స్టూడెంట్స్, స్టాఫ్ ఇబ్బందులు పడుతున్నారు. రూ.10,500 కోట్ల బకాయిల్లో సగం చెల్లించమని యాజమాన్యాలు కోరినా ప్రభుత్వం కమిటీలంటూ కాలయాపన చేస్తోంది’ అని ట్వీట్ చేశారు.

News November 5, 2025

మెదక్: కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు

image

రామాయంపేట మండల కేంద్రంలోని KGBV నిజాంపేటలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ప్రత్యేక అధికారిని రాణి తెలిపారు. వంట మనిషి, సహాయం వంటమనిషి, వాచ్‌మెన్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 18 నుంచి 45 సంవత్సరాల మహిళలు ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 5, 2025

ఇలా అయితే థియేటర్లు ఖాళీ అవుతాయ్: సుప్రీం

image

మూవీ టికెట్‌తో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రస్తుతం ఒక సినిమాకి ₹1,500 నుంచి ₹2,000కు ఖర్చవుతుంది. ధరలను నియంత్రించకపోతే సినిమా హాళ్లు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉంది’ అని కోర్టు పేర్కొంది. కర్ణాటకలో మూవీ టికెట్ ధరను రూ.200కు పరిమితం చేయడంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంను ఆశ్రయించగా ఈ విధంగా స్పందించింది.