News February 17, 2025
సిరిసిల్ల: బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే

ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ తెలిపారు. గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 18 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు.
Similar News
News April 18, 2026
విజయ్ చేతిలో శునకాలు.. ఆసక్తికరంగా కొత్త సినిమా పోస్టర్

హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. దర్శకుడి ఊహాశక్తికి తగ్గట్టుగా ఈ మూవీ కోసం తన సర్వస్వాన్ని అందిస్తానని విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలెజాండ్రో మార్టినెజ్(DOP), హేశమ్ అబ్దుల్ వాహెబ్(మ్యూజిక్), ఎరిక్ డర్స్ట్(VFX)ను పరిచయం చేశారు. హీరో శునకాలను, డైరెక్టర్ గుర్రాన్ని పట్టుకున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.
News April 18, 2026
పేరూరు చెరువును పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

చంద్రగిరి నియోజకవర్గంలో నీటి వనరుల సంరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న “జలధార – జలహారతి” కార్యక్రమంలో భాగంగా పేరూరు చెరువును కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు బైకుపై చెరువు పరిసర ప్రాంతాలు పతిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News April 18, 2026
KNR: వాహనదారులకు ‘రిజిస్ట్రేషన్’ కష్టాలు..!

వాహన్ పోర్టల్ అమలుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభమైందని చెప్పినా, RCలు సకాలంలో అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షోరూంల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయి 2 నెలలు గడిచినా RCలు అందకపోవడం గమనార్హం. TR గడువు ముగిసినా RC లేక వాహనదారులు రోడ్లపైకి వెళ్లలేకపోతున్నారు. RTO కార్యాలయాల్లో అడిగితే సాంకేతిక కారణాలంటూ పంపిస్తున్నారని బాధితులు చెబుతుండగా ఈ సమస్య కరీంనగర్, పెద్దపల్లి, HZBలలో ఎక్కువగా ఉంది.


