News February 17, 2025

వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: ఎస్పి

image

కడప జిల్లాలోని హోం గార్డ్స్ సిబ్బంది విధుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని జిల్లా ఎస్.పిఅశోక్ కుమార్ సూచించారు. జిల్లాలోని హోం గార్డు ఇతర సిబ్బందికి కడప జిల్లా పోలీస్ మైదానంలో రెండు వారాల మొబిలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హోం గార్డ్‌గా చేరకముందు తీసుకున్న శిక్షణను మరోసారి గుర్తు చేసుకుంటూ మొబలైజేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు.

Similar News

News July 10, 2025

కడప జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు

image

కడప జిల్లాలో గురువారం భారీగా పోలీసులు బదిలీ అయ్యారు. 169 పోలీస్ సిబ్బందిని ఒకేసారి బదిలీ చేస్తూ SP అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 24 మంది ASIలు, 32 మంది HCలు, 113 మంది PCలు ఉన్నారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న, ఆరోపణలున్న వారిని బదిలీ చేసిన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వులను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు.

News July 10, 2025

కడప MLA తీరుపై విమర్శలు

image

మొహర్రం సందర్భంగా నాదర్ షావలీ దర్గా ఉరుసు నిర్వహించారు. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కేసీ కెనాల్లో రొట్టెలు వదిలారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చెప్పులు వేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంతో పవిత్రంగా రొట్టెలు వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే చెప్పులు ధరించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పలువురు అంటున్నారు.

News July 9, 2025

కడప: మెరిట్ ఆధారంగా నేరుగా అడ్మిషన్లు

image

కడపలోని డా. వై‌ఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి బి.డిజైన్, బి.ఎఫ్.ఎ కోర్సులలో మెరిట్ ఆధారిత డైరెక్ట్ అడ్మిషన్లకు ఏపీఎస్ఎచ్ఈ అనుమతి లభించిందని వీసీ ప్రొఫెసర్ జి. విశ్వనాథ్ కుమార్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.