News February 17, 2025

NLG: రాష్ట్రం నుంచి ఏకైక ప్లేయర్.. SP అభినందన 

image

ఈనెల 14, 15న బెంగళూరులో జరిగిన ఫుట్‌బాల్ సౌత్ ఇండియా సెలక్షన్స్ ట్రయల్స్‌లో సూపర్ ఆటతో ఆకట్టుకున్న రాచూరి వెంకటసాయిని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సోమవారం అభినందించారు. కాగా, NLG ఛత్రపతి శివాజీ ఫుట్‌బాల్ క్లబ్‌కి చెందిన సాయి మార్చి 8,9 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఫైనల్ రౌండ్ సెలక్షన్‌కు ఎంపికయ్యాడు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారుడు వెంకటసాయి అని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గిరిబాబు తెలిపారు.

Similar News

News December 27, 2025

నల్గొండ జిల్లాలో ముమ్మరంగా నట్టల నివారణ కార్యక్రమం

image

నల్గొండ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 78 బృందాలుగా ఏర్పడిన 250 మంది సిబ్బంది గ్రామగ్రామాన జీవాలకు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం31వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 60 శాతం లక్ష్యం పూర్తయిందని, గొర్రె కాపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారులు సూచించారు.

News December 26, 2025

నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి: జాజుల

image

నల్గొండ జిల్లాలో బీసీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం కల్పించాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని, నామినేటెడ్ పదవుల ద్వారా భర్తీ చేసి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

News December 26, 2025

సాత్విక పొలిటికల్ ఎంట్రీ.. కోమటిరెడ్డి ఆశీర్వాదం

image

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన దుబ్బ సాత్విక గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన రాజకీయ ప్రస్థానానికి మద్దతు తెలపాలని కోరుతూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ముందుండి పనిచేస్తానని ఈ సందర్భంగా సాత్విక పేర్కొన్నారు.