News February 17, 2025
కరీంనగర్: కేసీఆర్‌కు బండి సంజయ్ బర్త్ డే విషెస్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ X (ట్విటర్) వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.
Similar News
News September 17, 2025
జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన విశాఖ మేయర్

విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లతో కలిసి అధ్యయన యాత్రలో భాగంగా జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బుధవారం సందర్శించారు. జైపూర్ మేయర్ డా.సౌమ్య గుర్జర్‌ను శాలువ వేసి సత్కరించగా, ఆమె కూడా విశాఖ మేయర్‌కు మెమెంటో అందించారు. జైపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, శానిటేషన్ విధానాలు, టూరిజం చర్యలపై అధికారులు వివరాలు అందించారు.
News September 17, 2025
సౌదాగర్ అరవింద్‌ను బహిష్కరించాం: TPCC చీఫ్

జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ SC సెల్ ఛైర్మన్‌గా చలామణి అవుతున్న సౌదాగర్ అరవింద్‌కు పార్టీలో ఎలాంటి పదవి లేదని, ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించడం జరిగిందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఈ కారణంగా అతడిని పార్టీ నుంచి బహిష్కరించామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
News September 17, 2025
సినీ ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ శ్రీనివాసులు మృతి

రొంపిచర్ల: సినిమా, సీరియల్ రంగంలో ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ పోతుల శ్రీనివాసులు(60) బుధవారం చెన్నైలో మృతి చెందారు. రొంపిచర్లలోని బెస్తపల్లికి చెందిన ఈయన 30 ఏళ్లుగా తమిళం, తెలుగు సినిమా, సీరియల్ రంగంలో ఉన్నారు. గుండెపోటు రావడంతో చెన్నైలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని తీసుకువస్తున్నారన్నారు.