News February 17, 2025

జగిత్యాల: యువకుడి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన యువకుడు మంతెన ప్రవీణ్(19) సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లారని, ప్రవీణ్ ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడని చెప్పారు. ఈ క్రమంలో ప్రవీణ్ సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. అతడి ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉందన్నారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News April 19, 2026

VZM: నదిలో పడి వ్యక్తి మృతి

image

గజపతినగరం(M) పురిటిపెంట ఎస్సీకాలనీకి చెందిన నీలంశెట్టి రమణ(50) చంపావతి నదిలో జారిపడి శనివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. రమణకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. కుటుంబానికి దూరంగా ఉంటున్న ఇతను ఓ ప్రైవేటు దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం అటుగా వెళ్తున్న సమయంలో మద్యం మత్తులో నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు.

News April 19, 2026

రాష్ట్రంలో భానుడి భగభగ.. ADBలో 44.3 డిగ్రీలు

image

TG: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్‌లో 43.1, మహబూబ్‌నగర్ 42.4, మెదక్ 42, రామగుండం 41.5, హకీంపేట్ 41.1, దుండిగల్ 40.3, భద్రాచలం 40.4, HYD 40.4, నల్గొండ 40, ఖమ్మంలో 40 డిగ్రీలుగా రికార్డయినట్లు వెల్లడించింది.

News April 19, 2026

HYD: MOU దశలో MMTSలో ‘ఫ్రీ ఫేర్‌’ (1)

image

MMTSలో ‘<<19687591>>జీరో ఫేర్<<>>’ (ఫ్రీ జర్నీ) ఎందుకో Way2News ఎక్స్‌క్లూజివ్‌లో తెలుసుకుందా. TG అవతరణ దినోత్సవం నుంచి ఏడాదిపాటు ప్రతిష్ఠాత్మకంగా నడపాలనే ప్రతిపాదనను CS రామకృష్ణరావు రైల్ నిలయంలో SCR GM సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ముందుంచారు. MMTS ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టంచేశారు. దీనిపై MOU ఇవ్వాలని రైల్వేశాఖ కోరింది. ప్రధానంగా HYDలో ట్రాఫిక్, కాలుష్యం తగ్గించడానికేనని సమాచారం.