News February 17, 2025
జనగామ: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో-ఎడ్యుకేషన్) ధర్మకంచలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలకు వారి కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News November 13, 2025
అయిజ: రేపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

అయిజ మార్కెట్ సబ్ యార్డులో రేపు (శుక్రవారం) సింగిల్ విండో ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు విండో ఛైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి గురువారం Way2News తో తెలిపారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రంలో అయిజ, గట్టు, మల్దకల్ మండలాల రైతులు మొక్కజొన్న విక్రయించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.
News November 13, 2025
నాయీ బ్రాహ్మణులకు గుడ్ న్యూస్

AP: రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలోని కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు బీసీ సంక్షేమ శాఖ మెమో జారీచేసింది. 1996లోని GO-13లో పేర్కొన్న నిబంధనలను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు సూచించింది.
News November 13, 2025
ADB: స్విమ్మింగ్‌లో దూసుకుపోతున్న చరణ్ తేజ్

ఆదిలాబాద్‌కి చెందిన కొమ్ము చరణ్ తేజ్ స్విమ్మింగ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన అతడు తాజాగా ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాడు. హైద్రాబాద్‌లోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చరణ్ తేజ్ కాంస్య పతకం సాధించాడు. 400 మీటర్ల ఐ.ఎం విభాగంలో కాంస్యం సాధించి మరోసారి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపాడు.


