News February 17, 2025
వాటిపై లోతైన విశ్లేషణ అవసరం: కలెక్టర్

ఒకే సమస్యపై ప్రజల నుంచి పదేపదే వచ్చే వినతులపై లోతైన విశ్లేషణ అవసరమని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వస్తున్న ఫిర్యాదులు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష చేశారు. పలు అంశాలపై కలెక్టర్ చర్చించారు. నాణ్యమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులందరిపైనా ఉందన్నారు.
Similar News
News September 15, 2025
విశాఖ డాగ్ స్క్వాడ్.. నేర నియంత్రణలో కీలకం

విశాఖ నగర పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో 18 శునకాలు నేర నియంత్రణలో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో 10 నార్కోటిక్, 6 ఎక్స్‌ప్లోజివ్, 2 ట్రాకర్ డాగ్స్ ఉన్నాయి. ఇటీవల రైల్వే స్టేషన్ పరిధిలో ఈ జాగిలాలు 41 కిలోల గంజాయిని పట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ సహకారంతో కొత్తగా 8 నార్కోటిక్ శునకాలు, నూతన కెన్నెల్స్ స్క్వాడ్‌లో చేరాయి. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News September 15, 2025
విశాఖ: ‘వీకెండ్‌లో స్విగ్గీ, జోమోటో రైడర్ల సమ్మె’

విశాఖలో స్విగ్గీ, జోమోటో రైడర్లు ప్రతి శని, ఆదివారాల్లో సమ్మె చేయాలని తీర్మానించారు. జగదాంబలో సీఐటీయూ కార్యాలయంలో రైడర్ల సమావేశం జరిగింది. జోమాటో యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందో? లేదో? చూస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కుమార్ అన్నారు. స్విగ్గీ యాజమాన్యం చర్చలకు రాలేదని తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.
News September 15, 2025
విశాఖలో పర్యటించనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 17న విశాఖలో పర్యటించనున్నారు. 16న రాత్రి ఆమె విశాఖ చేరుకుని ప్రైవేటు రిసార్ట్‌లో బస చేస్తారు. 17న ఉదయం 10 గంటలకు ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో జిఎస్టి సంస్కరణలపై ఔట్ రీచ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. 12 గంటలకు స్వస్థ నారీ కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగిస్తారు. 3 గంటలకు జీసీసీ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.