News February 17, 2025

పెద్దపల్లి: ‘భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ 

image

పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి, పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ‘భరోసా’ కేంద్రం పని చేస్తుందని సీపీ అన్నారు. అందుబాటులో ఉన్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులను పరిశీలించిన సీపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Similar News

News November 6, 2025

చేతులు మెరిసేలా..

image

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి దాన్ని చేతులకు రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోయి మృదువుగా మారతాయి.

News November 6, 2025

WGL: క్వింటా పసుపు రూ.11,738

image

చాలా రోజుల అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు గురువారం పసుపు తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపుకు రూ.11,738 ధర వచ్చింది. అలాగే మొక్కజొన్న సైతం తరలిరాగా రెండు రోజులతో పోలిస్తే ధర భారీగా పడిపోయింది. సోమవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,095, మంగళవారం రూ.2,055 ధర వస్తే.. ఈరోజు రూ.2,010 కి పతనమైంది. అలాగే దీపిక మిర్చి రూ.15,500 ధర వచ్చింది.

News November 6, 2025

తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్ @2PM

image

*రేపు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 12కు వాయిదా
*హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ కార్నర్ మీటింగ్‌కు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నేతల ఆందోళన.. సభ జరిపి తీరుతామని స్పష్టం
*జూబ్లీహిల్స్‌లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉందన్న కిషన్ రెడ్డి
*ఫిరాయింపు MLAలు తెల్లం వెంకట్రావు, సంజయ్‌లను నేడు విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్