News February 17, 2025

విశాఖలో 54 ఫోన్ల రికవరీ

image

కదిలే రైళ్లు, ప్లాట్ ఫాం, వెయిటింగ్ హాలులో చోరీకి గురైన ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. రూ.10 లక్షల విలువైన 54ఫోన్లను రైల్వే డీఎస్ఆర్పీ పి.రామచంద్రరావు సూచనలతో సీఐ ధనుంజయ నాయుడు ఇవాళ విశాఖ రైల్వే స్టేషన్‌లో బాధితులకు అందించారు. వేర్వేరు సందర్భాల్లో మిస్ అయిన ఫోన్లు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి రికవరీ చేశారు.

Similar News

News April 18, 2026

వర్షాకాల సమావేశాల్లో మళ్లీ మహిళా బిల్లు?

image

మహిళా రిజర్వేషన్ల బిల్లును మరోసారి లోక్‌సభ ముందుకు కేంద్రం తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జులైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. దాంతోపాటే డీలిమిటేషన్ బిల్లునూ సభ ముందు ఉంచాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో ఏం నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

News April 18, 2026

కోచ్ వేధిస్తున్నాడు: నీరజ్ చోప్రా

image

కోచ్ నావల్‌సింగ్‌ మానసికంగా వేధిస్తున్నాడని.. తమను, కుటుంబీకులను బూతులు తిడుతున్నాడని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, పారాలింపిక్ ఛాంపియన్ సుమిత్ అంటిల్ సహా మరికొందరు అథ్లెట్లు ‘సాయ్’కి ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి దూషిస్తున్నాడని, పోటీలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన ప్రవర్తన దారుణంగా ఉంటోందని సుమిత్ వాపోయారు. ఇలాంటి వ్యక్తులతో క్రీడావ్యవస్థకే చెడ్డపేరని, తక్షణమే చర్యలు తీసుకోవాలని నీరజ్ కోరారు.

News April 18, 2026

జ్ఞానులకు, అహంకారులకు మధ్య తేడా ఇదే!

image

నిండు నదులు పారు నిల్చి గంభీరమై
వెర్రివాగు పారు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గొప్ప నదులు గంభీరంగా, నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. కానీ చిన్న వాగులు మాత్రం ఎగిరెగిరి పడుతూ, శబ్దం చేస్తూ వేగంగా ప్రవహిస్తాయి. ఇదేవిధంగా జ్ఞానులు శాంతంగా, నిదానంగా ఉంటారు. అల్పులు మాత్రం తొందరపాటుతో అహంకారంగా మాట్లాడుతారు.
<<-se>>#PADHYAM<<>>