News February 17, 2025

రామగుండం: KCR బర్త్ డే.. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు

image

రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా వినూత్నంగా సేవా కార్యక్రమాలు చేపట్టి వండర్ బుక్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ రికార్డును రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు కోఆర్డినేటర్ నుంచి సోమవారం అందుకున్నారు. ఒకే రోజు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు ఈ అవార్డును అందుకున్నట్లు నేతలు తెలిపారు. 

Similar News

News October 17, 2025

జాతీయ రహదారి పనులపై కలెక్టర్ సమీక్ష

image

మంథని పట్టణంలో గురువారం కలెక్టర్ కోయ శ్రీ హర్ష విస్తృతంగా పర్యటించారు. ఎన్‌హెచ్ 163జీ నిర్మాణంలో భూ సేకరణ మిస్సింగ్ పరిహార సమస్యలను ఈనెల 24లోపు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. అక్టోబర్ 30లోపు మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో గ్రావెల్ పనులు పూర్తిచేయాలని సూచించారు. పర్యటనలో ఆర్‌డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఎన్‌హెచ్ పీడీ కీర్తి భరద్వాజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News October 17, 2025

కంచుకోటలు ఖాళీ అవుతున్నాయి!

image

బస్తర్, అబూజ్‌మడ్.. మావోయిస్టులకు కంచుకోటలు. ఎన్నో భీకర ఎన్‌కౌంటర్లకు వేదికలు. కానీ ఇప్పుడు అక్కడ తుపాకీ మూగబోతోంది. నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో వందల మంది మావోలు మరణించారు. దిక్కుతోచని స్థితిలో అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లాంటివారు కూడా లొంగిపోయారు. అబూజ్‌మడ్, నార్త్ బస్తర్ మావోరహిత ప్రాంతాలుగా మారాయని, ఇక మిగిలింది దక్షిణ బస్తరేనని అమిత్ షా ప్రకటించారు.

News October 17, 2025

పోలీసుల అదుపులో అత్యాచారం కేసు నిందితుడు

image

సంత్రగాచి ఎక్స్‌ప్రెస్ మహిళా బోగిలో మంగళవారం ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని తెనాలి రైల్వేస్టేషన్లో గుంటూరు GRP పోలీసులు అదుపులో తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో CC కెమెరాలను పరిశీలించి పట్టుకున్నారు. నిందితుడు పల్నాడు(D) సత్తెనపల్లి లక్కరాజుగార్లపాడుకు చెందిన జోన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. నిందితుడు గతంలో కేరళకు చెందిన మహిళపైనా అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.