News February 17, 2025

ఇచ్చాపురం: ఇటలీలో ఉద్యోగాలంటూ మోసం

image

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. పార్వతీపురానికి చెందిన ఓ ఏజెంట్‌తో కలిసి ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి వాసి ఈ మోసానికి పాల్పడ్డారు. జిల్లాలో ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షలు చొప్పున రూ.3 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దాదాపు 350 మంది నిరుద్యోగులను ఇటలీ పంపగా.. అక్కడ సరైన ఉద్యోగం లేక మోసపోయారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News March 12, 2025

మందస: భార్య, కూతురు అదృశ్యం..కేసు నమోదు

image

మందస మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన పానిల సింహాచలం (27) తన భార్య జ్యోతి (22), కుమార్తె హన్విక (11నెలలు) కనిపించడం లేదంటూ..మంగళవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన నా భార్య, కూతురు మందస మండలం కొర్రాయి గేటు వద్ద బస్సు ఎక్కి కాశీబుగ్గ వచ్చారని, అప్పటినుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News March 12, 2025

నరసన్నపేట: చిట్ ఫండ్ అధినేత కోరాడ గణేష్ ఆస్తుల జప్తు

image

నరసన్నపేటలోని ‘లక్ష్మీ గణేష్ చిట్స్’ సంస్థకు చెందిన కోరాడ గణేశ్వరరావు చరాస్తులను జప్తు చేస్తూ హోం శాఖ జీవో నెం. 46 ద్వారా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. కోరాడ గణేశ్వరరావు డిపాజిట్ల పేరుతో ప్రజల నుంచి రూ.5.86 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నరసన్నపేట స్టేషన్‌లో 2021లో కేసు నమోదైంది. 5.86 కోట్లు వరకూ దోచుకోగా కేవలం చరాస్తులు రూ.15.84 లక్షలు మాత్రమే గుర్తించారు.

News March 12, 2025

జి. సిగడాం: మూడు రోజుల తర్వాత బయటపడ్డ మృతదేహం

image

జి.సిగడాం మండలం దేవరవలస గ్రామానికి చెందిన కొడమాటి ఈశ్వరరావు, పద్మా దంపతుల కుమారుడు అశోక్ వత్సలవలస, రాజులమ్మ యాత్ర లో ఆదివారం సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని రక్షించాడానికి వెళ్లి గల్లంతయ్యాడు. బుధవారం ఉదయం సముద్ర తీరంలో మృతదేహం దొరికింది. ఈ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు దుఃఖానికి గురై విలవిలలాడుతున్నారు. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు.

error: Content is protected !!