News February 17, 2025
వచ్చే 3 నెలలు అత్యంత కీలకం: రేవంత్ రెడ్డి

TG: రాబోయే 3 నెలలు చాలా కీలకమని, వేసవి నేపథ్యంలో సాగు, తాగునీరు, విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని CM రేవంత్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చొరవ తీసుకునేలా కలెక్టర్లను ఆదేశించాలని సీఎస్‌కు సూచించారు. అలాగే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్‌కుమార్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న 3నెలలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రణాళిక ప్రకారం నీటిని వదలాలన్నారు.
Similar News
News November 13, 2025
కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 పోస్టులు

కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో కేంద్రీయ విద్యాలయంలో 9,156( 7,444 టీచింగ్, 1,712 నాన్ టీచింగ్ పోస్టులు), నవోదయలో 3,643 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, B.Ed, D.Ed, పీజీ, సీటెట్, ఇంటర్, డిప్లొమా, B.LSc అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి డిసెంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు.
News November 13, 2025
భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధం: పాకిస్థాన్

భారత్, అఫ్గానిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీగా ఉన్నామని పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌లో 12 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామేనని పాకిస్థానీ తాలిబన్ (TTP) ప్రకటించుకున్న తర్వాత ఆసిఫ్ చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత మద్దతుతోనే దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు.
News November 13, 2025
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

AP: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ వన్ స్టాప్ సెంటర్‌లో 4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చు. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 25 -42ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ, డిప్లొమా (సైకాలజీ), టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


