News March 21, 2024

అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి: డీఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో డబ్బు, మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలను డీఎస్పీ తిరుపతి రావు బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డబ్బు సరఫరా అవ్వకుండా ఉండేందుకు అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News July 5, 2024

KU ఎస్సై కుమారుడికి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‌లో చోటు

image

కేయూసీ పీఎస్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న దేవేందర్‌- స్వప్న దంపతుల కుమారుడు అక్షిత్‌ 6వ తరగతి చదువుతున్నాడు. అతి పిన్న వయస్సులోనే ప్రపంచ దేశాలకు సంబంధించిన రాజధానులతో పాటు ఆ దేశ కరేన్సీలను చూడకుండా ధారళంగా చెప్పాడు. ప్రతిభను గుర్తించిన తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ గుర్తింపు పత్రాన్ని జారీ చేశారు. శుక్రవారం ఈ పత్రాన్ని వరంగల్‌ సీపీ అంబర్ కిశోర్ ఝా తన చేతుల మీదుగా అక్షిత్‌కు అందజేశారు.

News July 5, 2024

మరో మైలురాయికి చేరువగా జనగామ ప్రభుత్వ డిగ్రీ కళాశాల!

image

జనగామ ఆంధ్ర భాషాభివర్ధిని (ABV) ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో మైలు రాయిని చేరుకోబోతోంది. జిల్లాలో ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఉన్న ఈ కాలేజీకి ఈ విద్యా సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి హోదా వస్తుందని ఆశిస్తున్నారు. UGC నిబంధనలను అనుసరించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతిపాదనలను UGCకి, కేయూ రిజిస్ట్రారు, కళాశాల అభివృద్ధి కమిటీ డీన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది.

News July 5, 2024

నర్సింహులపేట: ఇద్దరు యువకుల మృతి.. కేసు నమోదు

image

MHBD జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో అనుమానాస్పద స్థితిలో శ్రవణ్ (25), రహీమ్ (24) అనే ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం విదితమే. ఈ విషయమై స్థానిక పోలీసులకు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతికి కల్తీ కల్లు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.