News February 18, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

@గ్రీవెన్స్ డేలో 10 మంది అర్జీదారులతో ఎస్పీ @మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి 45 రోజుల జైలు శిక్ష..రూ.500 జరిమానా @జగిత్యాల పట్టణంలోని ఇంట్లో కాలిన కరెంటు మీటర్ @ఇబ్రహీంపట్నంలో ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు @కథలాపూర్‌లో యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య @పెగడపల్లిలో రైతులను మోసం చేసిన వ్యక్తులను రిమాండ్ చేసిన పోలీసులు @రాయికల్‌లో ఇద్దరు మృతి.. ఆర్థిక సాయం అందజేసిన గ్రామస్థులు
Similar News
News November 11, 2025
నీకు మరింత శక్తి చేకూరాలి సంజూ: CSK

ఇవాళ సంజూ శాంసన్ పుట్టినరోజు సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ అతడికి స్పెషల్ విషెస్ తెలిపింది. ‘నీకు మరింత శక్తి చేకూరాలి సంజూ. విషింగ్ యూ సూపర్ బర్త్‌డే’ అంటూ అతడి ఫొటోను Xలో షేర్ చేసింది. IPLలో శాంసన్‌ను CSK తీసుకోనుందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. దీంతో సంజూ చెన్నైకి రావడం కన్ఫర్మ్ అయిందంటూ ఆ జట్టు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News November 11, 2025
మొట్టమొదటి మహిళా ఫొటో జర్నలిస్టు హొమి వైర్‌వాలా

భారత్‌లో మొదటి మహిళా ఫోటో జర్నలిస్టు హొమి వైర్‌వాలా. 1930ల్లో కెరీర్ ప్రారంభించిన హొమి తాను తీసిన ఫొటోల ద్వారా దేశమంతటికీ సుపరిచితురాలయ్యారు. ఢిల్లీకి వెళ్లి గాంధీజీ, ఇందిరా గాంధీ, నెహ్రూ వంటి పలు జాతీయ,రాజకీయ నాయకులతో పనిచేశారు. 1970లో రిటైర్ అయిన తర్వాత అనామక జీవితం గడిపారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2011లో దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించింది.
News November 11, 2025
HYD: “ఏ బాబు లెవ్”.. ఓటెయ్!

జూబ్లీహిల్స్‌లో పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.02 శాతం మాత్రమే నమోదు అయ్యింది. ఓటర్లు ఇకనైనా మేల్కొనాలని SMలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘ఏ బాబు లెవ్.. ఓటెయ్’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సెలవు ఉంటే నగరవాసులు కాస్త ఆలస్యంగానే లేస్తారని ఓ అధికారి సైతం గుర్తుచేశారు. కానీ, మరీ ఆలస్యం అయ్యింది. ఇకనైనా మేల్కొండి. ఓటింగ్ పర్సంటేజ్‌ను పెంచండి.
SHARE IT


