News February 18, 2025
పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

పట్టిసీమ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం, తొక్కిసలాటలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన మహాశివ రాత్రి ఉత్సవాలు పట్టిసీమ వద్ద గోదావరి మధ్యన ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానంలో జరుగనున్నాయి. శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.
Similar News
News January 15, 2026
కడప: వైట్ అండ్ వైట్‌లో మెరిసిన పోలీసులు

నిరంతరం విధి నిర్వహణలో భాగంగా డ్రెస్‌లో కనిపించే పోలీస్ అధికారులు భోగి పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో కనువిందు చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసి భోగి పండుగను స్వాగతించారు. జిల్లా ఎస్పీతో సహా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా కనిపించారు.
News January 15, 2026
114 రాఫెల్స్.. రూ.3.25 లక్షల కోట్ల డీల్!

భారత రక్షణ రంగంలోనే అతిపెద్ద ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది. ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.3.25 లక్షల కోట్ల డీల్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలించనుంది. ఈ వారాంతంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒప్పందంలో భాగంగా 30% స్వదేశీ పార్ట్స్‌తోనే ఇండియాలోనే తయారీకి ప్రణాళికలు రూపొందించారు. ఈ డీల్ ఫిక్స్ అయితే భారత్‌లో రాఫెల్స్ సంఖ్య 176కు పెరగనుంది.
News January 15, 2026
పసుపు పంటలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

పసుపు పంట సుడి దగ్గర ఆకులు వాడి, ఎండిపోయి, లాగినప్పుడు మొవ్వు సులభంగా ఊడొచ్చి, దుంప లోపల బియ్యం గింజల్లాంటి పిల్ల పురుగులు కనిపిస్తే అది దుంప తొలుచు ఈగగా గుర్తించాలి. దీని నివారణకు ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్య వేయాలి. సెంటుకు 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలకు అదే పరిమాణం గల ఇసుకతో కలిపి పొలంలో తెగులు ఆశించిన దగ్గర చల్లాలి. అలాగే మొక్కల మధ్య నీరు నిల్వకుండా జాగ్రత్త వహించాలి.


