News March 21, 2024

అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలి: కలెక్టర్

image

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికారులంతా నిబంధనల ప్రకారం పని చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వివిధ పథకాల కింద ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

Similar News

News March 11, 2026

KNR: బుల్లెట్ బైక్‌ల సైలెన్సర్ల మోతపై సీపీ ఉక్కుపాదం

image

కరీంనగర్ నగరంలో మితిమీరిన శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బుల్లెట్ వాహనాలపై పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు మార్చి, ‘ఫైర్’ శబ్దాలతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఆకతాయిల వాహనాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఈ మేరకు అధిక శబ్దం చేస్తున్న పలు బైక్‌లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 11, 2026

కరీంనగర్‌లో ‘ఈ-ఆఫీస్’ సేవలు ప్రారంభం

image

పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ సేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై అన్ని విభాగాల్లో ఫైళ్లను, ప్రజల ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారానే వేగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పారదర్శక పాలన కోసమే ఈ డిజిటల్ సంస్కరణలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

News March 10, 2026

KNR: ఐస్‌క్రీం తయారీ కేంద్రంపై దాడులు

image

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘ఉత్తమ్ ఐస్ క్రీమ్’ తయారీ కేంద్రాన్ని జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేశారు. ప్యాకింగ్‌పై చిరునామా, FSSAI లైసెన్స్ నంబర్లు లేకపోవడం, తప్పుడు కేటగిరీలో లైసెన్స్ పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.6,000 విలువైన స్టాక్‌ను సీజ్ చేసిన అధికారులు, తయారీదారులు వెంటనే లైసెన్సులు పొందాలని ఆదేశించారు.