News February 18, 2025

సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి: ఎస్పీ

image

చట్ట పరిధిలోని సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీసులను ఆదేశించారు. రాయచోటిలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కారవేదిక’ కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

Similar News

News November 11, 2025

కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్.. Way2Newsలో వేగంగా..

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఈ సాయంత్రం విడుదల కానున్నాయి. సా.6.30 గం.కు వివిధ ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నాయి. Way2Newsలో వేగంగా వాటిని తెలుసుకోవచ్చు. మరోవైపు ఈ నెల 14న ఎన్నికల తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

News November 11, 2025

వనపర్తి: ‘ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’

image

వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ (CO-ED) కళాశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News November 11, 2025

యాపిల్ కొత్త ఫీచర్.. నెట్‌వర్క్ లేకున్నా మ్యాప్స్, మెసేజెస్!

image

మొబైల్ నెట్‌వర్క్‌ అందుబాటులో లేకున్నా మ్యాప్స్, మెసేజ్‌లు పనిచేసే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు యాపిల్ ప్రయత్నిస్తోందని బ్లూమ్‌బర్గ్ ఒక రిపోర్టులో తెలిపింది. యాపిల్‌కు చెందిన ఇంటర్నల్ శాటిలైట్ కనెక్టివిటీ గ్రూప్ ఇప్పటికే గ్లోబల్‌స్టార్‌ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. శాటిలైట్ ద్వారా పనిచేసే ఎమర్జెన్సీ SOS ఫీచర్‌ను 2022లో విడుదల చేసిన iPhone14లోనే అందుబాటులోకి తెచ్చింది.